రైతన్నలకు తీపి కబురు: ఖరీఫ్లో విజయవంతంగా ఎరువుల పంపిణీ పూర్తి చేసిన సర్కార్

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి రసాయన ఎరువుల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఎరువులు సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా సుమారు ముప్పై మూడు లక్షలకు పైగా రైతులకు, కేంద్ర యాప్ ద్వారా ముప్పై ఏడు లక్షలకు పైగా రైతులకు ఎరువుల బస్తాలు అందించినట్లు స్పష్టం చేశారు.