హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతి లేదని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన నగరవాసులకు సూచించారు.