టాలీవుడ్లో మరో పెళ్లి సందడి: త్వరలో వైవాహిక బంధంలోకి హీరో తేజ సజ్జా
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ లో నిశ్చితార్థం జరిగి, డిసెంబర్ లో ఉదయ్ పూర్ వేదికగా వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పెళ్లికి సంబంధించి తేజ సజ్జా కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.