గంగమ్మ ఒడికి చేరిన వర్ధన్నపేట గణనాథుడు
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో కొలువైన గణపయ్య ఐదు రోజుల పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన నిమజ్జన శోభాయాత్ర అంబరాన్నంటింది. భారీ బ్యాండ్ మేళాల వాయిద్యాలు, ధగధగలాడే లైటింగ్స్, హోరెత్తించే బాణసంచా మోతల మధ్య భక్తులు, శివాజీ యూత్ సభ్యులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా గణనాథుడిని సాగనంపారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో పట్టణ వీధులన్నీ మార్మోగాయి. యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ముగించారు.