హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్: భూసేకరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించి ప్రస్తుతం కేవలం అలైన్మెంట్ అధ్యయనాలు మాత్రమే జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక దశలో హైస్పీడ్ రైల్ పేరుతో ఎవరైనా భూసేకరణకు పాల్పడితే అది పూర్తిగా చట్టవిరుద్ధం అవుతుందని ఆయన తేల్చిచెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం అనంతరం ఈ వివరాలను ఆయన వెల్లడించారు.