ఎల్ నినో కరువు కంటే రేవంత్ రెడ్డి ప్రమాదకరం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
ఎల్ నినో విపత్తు కంటే సీఎం రేవంత్ రెడ్డే ప్రమాదకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవకాశం ఉన్నా విద్యుదుత్పత్తి చేయకుండా కరెంటు కోతలు విధిస్తున్నారని, నీళ్లున్నా లిఫ్టులు ఆన్ చేయకుండా లేని కరువును సృష్టిస్తున్నారని విమర్శించారు. నాడు కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్ నాయకులు నానా యాగీ చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.