స్థానిక ఉత్పత్తులు కొని చేతివృత్తుల కళాకారులకు అండగా నిలవాలన్న ప్రధాని మోదీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

దీపావళి సందర్భంగా స్థానిక కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోందని, స్థానిక వస్తువులను ప్రోత్సహించడం ద్వారా కళాకారులు మరియు రైతులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.