రాఖీ కట్టిన సోదరుడినే వివాహం చేసుకున్న యువతి బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించిన తండ్రి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ప్రయాగ్‌రాజ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. గత పదిహేనేళ్లుగా రాఖీ కడుతూ సోదరుడిగా భావించిన శాశ్వత్ గుప్తాని ఇవాళ నందిని పాండే ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ పెళ్లిపై తీవ్ర మనస్తాపానికి గురైన యువతి తండ్రి ఆమె బతికుండగానే బొమ్మతో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమతో బంధం పూర్తిగా తెగిపోయిందని, ఆమె తమకు చనిపోయినట్లేనని తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ వర్గాలు స్పష్టం చేశాయి.