పొదలకూరులో అమర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీతో ఘన నివాళి
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొదలకూరులో పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్ఐ శివ రాకేష్ తమ సిబ్బందితో కలిసి స్థానిక పోలీస్స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమర పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.