మధురవాడ జోన్ కార్యాలయంలో లీకవుతున్న పైఅంతస్తు స్లాబ్స్
రిపోర్టర్: రమేష్
స్థలం: విశాఖపట్నం
గ్రేటర్ విశాఖ మధురవాడ జోన్ కార్యాలయంలో ఏడాది క్రితం యాభై లక్షలతో నిర్మించిన భవనం నాణ్యతా లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. చిన్నపాటి వర్షానికే పైఅంతస్తు స్లాబ్ ల నుండి నీరు కారుతుండటంతో ప్రజాధనం దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది తిరగ ముందే భవనం డొల్లతనం బయటపడటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.