పుణెలో దారుణం: చారిత్రక కస్బా గణపతి ఆలయంలో చోరీ, అరవై వేలు దోపిడీ

రిపోర్టర్: మహేష్ స్థలం: Pune

పుణెలోని ప్రసిద్ధ చారిత్రక కస్బా గణపతి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగ బీభత్సం సృష్టించాడు. హుండీని పగులగొట్టి దాదాపు అరవై వేల రూపాయల నగదును దోచుకెళ్లినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హృషికేశ్ రావాలే వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు బృందాలను రంగంలోకి దించారు.