రాతి శిలలో మహా వినాయక రూపం దర్శనం
రిపోర్టర్: రాము
స్థలం: మెదక్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్ అడవిలో లక్ష్మినృసింహ స్వామి కొండపై ఉన్న భారీ బండరాయిపై వెలిసిన మహా వినాయక రూపానికి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు విశేష పూజలు చేయగా, భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.