'కారు బొనెట్పై యువతిని ఈడ్చుకెళ్లి..': లక్నోలో దారుణం
రిపోర్టర్: సతీష్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో గోమతీ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఉన్న జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద అనామిక అనే 22 ఏళ్ల యువతిని కారు బొనెట్పై ఈడ్చుకెళ్లి ఆమెపై నుంచి కారు పోనిచ్చిన దారుణ ఘటన కలకలం రేపింది. మరో మహిళతో కారులో ఉన్న షాహనవాజ్ (26)ను అనామిక నిలదీయడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. కారుతో వెళ్తుండగా అడ్డుపడిన ఆమెపైకి నిందితుడు వేగంగా వాహనం నడిపాడు. బొనెట్పై పట్టుతప్పి కిందపడిన యువతిపై నుంచి కారు పోనిచ్చి పరారైన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.