బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్గా నియమితులైన తేజ యాదవ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్యాల

నల్గొండ జిల్లా భారతీయ జనతా యువమోర్చా సోషల్ మీడియా విభాగం జిల్లా కో-కన్వీనర్గా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఈరటి తేజ యాదవ్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి కృషి చేస్తానని తేజ యాదవ్ స్పష్టం చేశారు.