ఏపీ పోలీసు స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు: డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

రిపోర్టర్: రాజేష్ స్థలం: గుంటూరు

రాష్ట్ర పోలీసు క్రీడాకారులను జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు ‘ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రకటించారు. విట్‌-ఏపీతో ఒప్పందం చేసుకుని, ఆధునిక వసతులతో శిక్షణ ఇస్తామన్నారు. మంగళగిరిలో జరిగిన ఏపీ స్టేట్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2026 ముగింపులో ఆయన పాల్గొన్నారు. ‘మనది ఏపీ పోలీస్‌ టీమ్, మనమంతా ఒకే కుటుంబం’ అని పిలుపునిచ్చారు. విజేతలకు ట్రోఫీలు అందజేశారు.