ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన కమల్జీత్ సురుచి జోడీ
రిపోర్టర్: విజయ్
స్థలం: జపాన్
ఆసియా క్రీడలు 2026లో భారత్ అద్భుత విజయం సాధించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కమల్జీత్, సురుచి ఇందర్ సింగ్ జోడీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఐచీ జనరల్ షూటింగ్ రేంజ్లో జరిగిన ఈ పోటీలో భారత జంట అద్భుత ప్రతిభ కనబరిచింది. ఫైనల్లో దక్షిణ కొరియా జట్టుపై ఆధిపత్యం చెలాయించి దేశానికి రెండో స్వర్ణం అందించారు. క్వాలిఫికేషన్ నుంచి ఆఖరి వరకు సత్తా చాటి పతకం సాధించారు.