డీఎస్సీ నిర్వహణపై అబద్ధాలు మానుకుని దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సీఎం చంద్రబాబు సవాల్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: చిత్తూరు

కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహణపై ప్రతిపక్షాలు కావాలని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. డీఎస్సీకి అసలైన చిరునామా చంద్రబాబు, టీడీపీయేనని, 16 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. తగిన ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, లేదంటే కోర్టుకు వెళ్లాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.