ఖమ్మంలో పోలీస్ ఉద్యోగార్థులకు భారీ మోడల్ టెస్ట్ ప్రకటించిన ఏఐవైఎఫ్
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ ఐదున ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం జిల్లా స్థాయి మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి చింతల రమేష్ తెలిపారు. అభ్యర్థులు తమ ప్రతిభను అంచనా వేసుకునేందుకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివరాల కోసం 9908842328 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.