దారుణం: ఇంట్ లో పనులు చేయలేదని తండ్రిని కత్తితో పొడిచి చంపిన కూతురు

రిపోర్టర్: కిరణ్ స్థలం: సూరత్

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటి పనులు చేయకపోవడంతో మందలించి మొబైల్ ఫోన్ పగలగొట్టాడన్న కోపంతో కాజల్ అనే యువతి తన తండ్రి రమేష్సింగ్ కైలాష్సింగ్ రాజ్పుత్ను ప్రెషర్ కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై మృతుడి భార్య మంజుబెన్ ఫిర్యాదు మేరకు అమ్రోలి పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.