ఎల్నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

రిపోర్టర్: గోపి స్థలం: Telangana

ఎల్నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ సీఎంవో పేర్కొంది. ప్రకృతి ప్రకోపంతో సంభవించిన ఈ తీవ్ర విపత్తును ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రానికి సంపూర్ణంగా అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన గట్టిగా కోరారు.