కాల్వపల్లిలో ఉత్సాహంగా సాగిన ఉచిత కంటి వైద్య శిబిరం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో నీయో వీజన్ ఐ కేర్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ ఇంజ లక్ష్మీ, జిల్లా కార్యదర్శి ఇంజ నరేష్ ప్రారంభించారు. డాక్టర్లు మధురిక, కార్తీక్, ప్రసాద్, బాలాజీలు సుమారు 90 మంది గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాను, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.