కోస్తాంధ్రకు వాయుగుండం ముప్పు మరియు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విశాఖపట్నం

బంగాళాఖానంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రకు వాతావరణశాఖ రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించింది. విశాఖ-గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున పలుచోట్ల అత్యంత భారీవర్షాలు కురవనున్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, వంశధార, నాగావళి నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.