భారతీయ జెల్బికి కవలగా చైనా దేశపు ప్రాచీన ట్యాంగ్ హువాన్ స్వీట్

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన జెల్బి వంటకాన్ని పోలిన స్వీట్ చైనా దేశంలో కూడా ఉందని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ట్యాంగ్ హువాన్ మరియు జెల్బి ఫోటోలను పంచుకోవడంతో ఈ విషయం వైరల్ అయింది. రూపంలో ఒకేలా ఉన్నప్పటికీ వీటి తయారీ విధానంలో తేడాలు ఉన్నాయని నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.