విద్యార్థులకు అలర్ట్: విడుదలైన డీఎస్ఎస్ఎస్బీ రిక్రూట్మెంట్ పరీక్షల తుది కీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

వివిధ ఆన్లైన్ నియామక పరీక్షలకు సంబంధించి తుది కీలను విడుదల చేసినట్లు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అధికారులు తెలిపారు. అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ రేడియోగ్రాఫర్, అసిస్టెంట్ మేనేజర్ వంటి వివిధ పోస్టుల పరీక్షలకు ఈ తుది కీలు వర్తిస్తాయని బోర్డు స్పష్టం చేసింది.