ఆంధ్రా పేపర్ మిల్స్ తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం గోదావరి కాలుష్యానికి ఆంధ్రా పేపర్ మిల్స్ కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పన్నులు ఎగ్గొడుతూ, కోర్టుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నోటీసులు ఇచ్చినా స్పందించని యాజమాన్యంపై ఇక ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.