స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: నెల్లూరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే, తమ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అంతకంటే ఎక్కువ సీట్లను బీసీలకు కేటాయిస్తామని వెల్లడించారు. వైకాపా పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని, ప్రతిపక్షం ఎన్నికలను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.