అక్రమ కేసులతో బెదిరించలేరంటూ రేవంత్ రెడ్డి సర్కార్కు కేటీఆర్ సవాల్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సిరిసిల్ల
సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఆస్తులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపైనా దర్యాప్తుకు సిద్ధమని సవాల్ విసిరారు. సిరిసిల్లలో పోలీసులతో దండయాత్రలా సీఎం పర్యటించారని మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం మౌనం వీడాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులతో తమను భయపెట్టలేరని కేటీఆర్ స్పష్టం చేశారు.