పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ముప్పు: కాళ్ల నొప్పులను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిక

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతినడం లేదా మూసుకుపోవడాన్ని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటారని ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ చిరాగ్ డి వెల్లడించారు. నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, తిమ్మిరి రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణమని ఆయన పేర్కొన్నారు. రక్తనాళాల గోడల్ లో కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని, కాళ్లకు తగినంత ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు.