కింగ్ ఛార్లెస్‌తో భేటీపై తప్పుడు వార్తలను ఖండించిన మైక్ హెస్సన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
కింగ్ ఛార్లెస్‌తో భేటీకి సల్మాన్ అలీ అఘా నిరాకరించారన్న వార్తలను పాకిస్థాన్ కోచ్ మైక్ హెస్సన్ ఖండించారు. ఇది అవాస్తవమని, బాధ్యతారహితమైన జర్నలిజమని ఆయన మండిపడ్డారు. సదరు ఆటగాళ్లను జట్టు నుంచి ముందే తొలగించామని, అందుకే వారు ఆహ్వానితుల జాబితాలో లేరని స్పష్టం చేశారు. లేని విషయాన్ని సృష్టించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హెస్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.