స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కాకాణి పిలుపు

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో ఆ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పని చేసి గెలిచి తీరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక రాజకీయ పరిస్థితులపై మరియు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.