మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు: అధికారుల కీలక నిర్ణయం

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలి ఉన్న ఎనిమిది వందల ఏడు మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం దరఖాస్తుల గడువును ఈ నెల ఆరవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు. వ్యాపారుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ఏడవ తేదీన దరఖాస్తుల పరిశీలన చేపట్టి, ఎనిమిదవ తేదీన కలెక్టర్ల పర్యవేక్షణలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.