దిల్లీలో గ్రీన్ టపాసుల మోతకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: దిల్లీ
దిల్లీ ఎన్సీఆర్ పరిధిలో నవంబర్ ఏడు, ఎనిమిది తేదీల్ లో గ్రీన్ టపాసులు కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కాలుష్య నివారణపై పూర్తి స్థాయి సమాచారం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. దీపావళి పండుగ సందర్భంగా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు, రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది. ఆసుపత్రులు, విద్యా సంస్థల సమీపంలో నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.