టెక్ ఇంటర్వ్యూలో నరకం: అమెరికా కంపెనీ తీరుపై అభ్యర్థి తీవ్ర ఆవేదన

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

అమెరికా సంస్థ నిర్వహించిన సుదీర్ఘ సాంకేతిక ఇంటర్వ్యూలో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఓ ఐటీ ఉద్యోగార్థ్ది ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో ఇంటర్వ్యూయర్ తన ప్రాజెక్ట్ కోడ్ లోని ప్రతి లైన్ పై ప్రశ్నలు అడగడంతో పాటు భారతీయ వెబ్సైట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ దారుణ అనుభవం కారణంగా ఇకపై తాను ఐటీ ఉద్యోగాల వైపు చూడబోనని రెడ్డిట్ వేదికగా సోమవారం వెల్లడించారు.