నా చిన్ననాటి పేదరికం గురించి స్మృతి ఇరానీ భావోద్వేగం
రిపోర్టర్: గోపి
స్థలం: India
తన బాల్యం నాటి పేదరికం, ఎదుర్కొన్న కష్టాలను ప్రముఖ రాజకీయ నాయకురాలు, నటి స్మృతి ఇరానీ గుర్తుచేసుకున్నారు. తన దగ్గర కేవలం 200 రూపాయలు ఉన్న సమయంలోనే తొలి అవకాశం దక్కిందని తెలిపారు. పేదరికం నేర్పిన శిక్షణ మరెక్కడా దొరకదని, ఏదీ లేకపోవడమే కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తుందని ఆమె సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పంచుకున్నారు.