రైల్వే స్టేషన్లలో ప్రత్యేక మార్గాలు: ప్రయాణికులకు దిశానిర్దేశం చేస్తున్న ట్యాక్టైల్ పాత్వే

రిపోర్టర్: గోపి స్థలం: కాజీపేట

కాజీపేట రైల్వే జంక్షన్ లో అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అంధులు, వృద్ధుల కోసం ప్రత్యేక ట్యాక్టైల్ పాత్వేలను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పసుపు, నారింజ రంగు గైడింగ్ టైల్స్ ద్వారా ప్రయాణికులకు తాగునీరు, మరుగుదొడ్ల మార్గాలను సులభంగా గుర్తించేలా ఈ ఆధునిక వసతులు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా నూతన హంగులతో రూ.2 వేల కోట్ల పైచిలుకు నిధులతో నలభై స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.