కలెక్టర్ల సదస్సులో జిల్లాల వారியாக ఉత్తమ విధానాల ప్రదర్శన
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో కలెక్టర్ల సదస్సులో వివిధ జిల్లాల కలెక్టర్లు తాము అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను వివరించారు. అల్లూరి జిల్లాలో డ్రోన్ల ద్వారా రక్త పరీక్షలు, వైద్య సేవలు అందిస్తుండగా, అనంతపురంలో పాఠశాల స్థాయిలో క్రీడాకారులను గుర్తిస్తున్నారు. బాపట్లలో ఆటిజం విద్యార్థుల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయగా, కర్నూలులో లోటు వర్షపాతాన్ని తట్టుకునే సాగు విధానాలను అమలు చేస్తున్నారు.