రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం మరియు పంటల నష్టం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఎల్‌నినో ప్రభావం మరియు అధిక ఉష్ణోగ్రతల కారణంగా నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంతో పోలిస్తే 21 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు తగ్గగా, 497 మండలాల్లో లోటు వర్షపాతం, 125 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేక పత్తి, కంది, వరి పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.