మహిళా పోలీసులతో కాంగ్రెస్ నేతల దౌర్జన్యం: రాహుల్ తీరుపై బీజేపీ ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh
మహిళా పోలీస్ సిబ్బంది పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరుపై BJP Andhra Pradesh తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రియాంక గాంధీ మహిళా పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడగా, రాహుల్ గాంధీ కెమెరా ముందే మహిళా పోలీస్ అధికారితో తోపులాటకు దిగి దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే నేతలే రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటల్లో గొప్పలు చెప్పే నాయకుల నిజస్వరూపం ప్రజల ముందు పూర్తిగా బట్టబయలైందని వారు స్పష్టం చేశారు.