పాకిస్థాన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులతో కరచాలనం చేసిన భారత ప్లేయర్లు
రిపోర్టర్: శివ
స్థలం: జపాన్
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో మహిళల టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ ఎఫ్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ, ఆకుల శ్రీజ, సింద్రేలా దాస్ త్రయం అద్భుత ప్రదర్శన కనబరిచి తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు నమోదు చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ప్లేయర్లు సుతీర్థ ముఖర్జీ, శ్రీజ అకుల పాకిస్థాన్ క్రీడాకారిణులతో కరచాలనం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.