మల్లగూడెంలో ఘనంగా వాలీబాల్ పోటీలు: ఉత్సాహంగా పాల్గొన్న గ్రామీణ యువత
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం మల్లగూడెం గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని శనివారం వాలీబాల్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ జన్నపల్లి బాలరాజు రెడ్డి, ఉప సర్పంచ్ రెడ్డబోయిన కవిత రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో యువకులు ఉత్సాహంగా తలపడ్డారు. వార్డు సభ్యులు నీల జాంగీర్, బోయిన నాగరాజు, కనకమ్మ, రాములు, మాజీ సర్పంచ్ గొడుగు రాజు, మాజీ ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.