నర్సంపేట వాగులో మొసలి కలకలం పాకాలకు తరలింపు
రిపోర్టర్: శేఖర్
స్థలం: నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట శివారు బొజ్జ నాయక్ తండావాగులో మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని, ఎఫ్బీవో వెంకన్న ఆధ్వర్యంలో మొసలిని సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని పాకాల సరస్సులో విడిచిపెట్టడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వాగు పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.