యుసీజీ ప్రాజెక్టు పేరుతో రైతుల భూములు గుంజుకుంటున్నారంటూ ఆవేదన

రిపోర్టర్: గోపి స్థలం: ఏలూరు జిల్లా

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల, చింతలపూడిలో ప్రతిపాదిత యూసీజీ బొగ్గు గనుల ప్రాజెక్టు కోసం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా భూములు లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు డీపీఆర్ ప్రకటించకుండా, నష్టాలపై స్పష్టత ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. శెట్టివారిగూడెం, వెంకటాపురం సహా పలు గ్రామాల రైతులు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నా రెవెన్యూ అధికారులు బలవంతంగా సర్వేలు నిర్వహిస్తున్నారని వాపోయారు.