నెల్లూరులో ఎస్పీ బాలు స్మృతులను సజీవంగా నిలుపుతున్న జ్ఞాపకాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

భౌతికంగా దూరమైనా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటల రూపంలో ప్రజల మధ్యే ఉన్నారు. పుట్టి పెరిగిన నెల్లూరు గడ్డపై ఆయన జ్ఞాపకార్థం సంగీత పాఠశాలకు పేరు పెట్టడంతో పాటు ఎన్టీఆర్ పార్కులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం గౌరవించింది. తిప్పరాజువారి వీధిలోని సొంతింటిని కంచి కామకోటి పీఠానికి విరాళంగా ఇచ్చి వేద పాఠశాలను ఏర్పాటు చేయించారు. అయితే ప్రభుత్వ సంగీత పాఠశాలకు నేటికీ శాశ్వత భవనం లేకపోవడం గమనార్హం.