మహారాష్ట్రలో భారీగా గుట్కా స్వాధీనం ముగ్గురు అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి రూ. 1.13 కోట్ల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ నుండి వస్తున్న ట్రక్కును అధికారులు ఛాకచక్యంగా వెంబడించి చాకన్-తలేగావ్ చౌక్ వద్ద పట్టుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ నఫీస్ మెహబూబ్ ఖాన్ తో పాటు నీలేష్ రాథీ, అరుణ్ పాటిల్, సంజయ్ మాటా లను అరెస్ట్ చేసి, నిందితులపై మరింత కఠినమైన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని పోలీసులు పరిశీలిస్తున్నారు.