వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అజెండా ఖరారైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై చర్చకు ఆమోదం లభించింది. 22ఏ భూముల అంశంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన 25 ప్రధాన అంశాలపై సభలో చర్చించాలని అధికార పక్షంపై ఒత్తిడి తెచ్చారు.