కాణిపాకం ఆలయంలో ఘనంగా వరుణజపం, వరుణయాగం: సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో వరుణజపం మరియు ప్రత్యేక వరుణయాగం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, దేవస్థానం ఈఓ, చైర్మన్ తదితర ప్రముఖులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.