'పాలమూరు నీటి గోస తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్': కేటీఆర్
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
పాలమూరు నీటి గోసను తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంపులు ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి పాలనలో వలసలు, కరువు కాటకాలకు నెలవుగా ఉన్న పాలమూరు జిల్లాను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి చరిత్ర సృష్టించారని ఆయన ప్రశంసించారు.