ఢిల్లీకి కొండా సురేఖ.. హైకమాండ్ పిలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ!
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ కేబినెట్ నుంచి వైదొలిగిన కొండా సురేఖను పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి ఆహ్వానించింది. ఆదివారం తన అనుచరులతో సమావేశం అనంతరం ఆమె ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆమెకు కీలక నామినేటెడ్ పదవి లేదా ప్రత్యేక బాధ్యత అప్పగించే అవకాశముంది. కాంగ్రెస్ హైకమాండ్ భరోసా నేపథ్యంలో సురేఖ తీసుకోబోయే తుది నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.