నేపాల్ వరదల్లో 275 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు

రిపోర్టర్: రాము స్థలం: World

నేపాల్ వరదల కారణంగా 275 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇప్పటివరకు 166 మందిని రక్షించామని, సహాయక చర్యల కోసం 95 టన్నుల సామగ్రిని, 54 మంది నిపుణులను నేపాల్‌కు పంపామని తెలిపారు. నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, బాధితుల కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశామని ఆయన స్పష్టం చేశారు.