రామలీలా మార్చ్‌కు తరలిరాలంటూ రాహుల్ గాంధీ పిలుపుపై మంత్రి సీతక్క స్పందన
రిపోర్టర్: సునీల్
స్థలం: ములుగు
భారత రాజ్యాంగాన్ని రక్షించడంతో పాటు ఓట్ల చోరీని అడ్డుకునేందుకు అందరూ ఢిల్లీలోని రామలీలా మైదానానికి తరలిరావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారని దనసరి అనసూయ (సీతక్క) - మంత్రి, ములుగు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, దేశ ప్రజలందరి గొంతుక అని పేర్కొంటూ ఆమె ఈ పోస్టును పంచుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.